హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో వర్షాలతోపాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.