పొరుగు రాష్ట్రంలో ఉంటూ మాతృభాష వికాసానికి చెన్నపురి తెలుగు అకాడమీ(సీటీఏ) నిరంతరం శ్రమించడం అభినందనీయమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. 1971-73 కాలంలో ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ప్రచురించిన చారిత్రక శిష్ట వ్యవహారిక భాష నివేదికను పునఃముద్రించడం హర్షనీయమన్నారు. తెలుగుకు ప్రాచీన హోదా దక్కి పదేళ్లయిన సందర్భంగా ఈ గ్రంథాన్ని తీసుకురావడం సంతోషంగా ఉందని వెల్లడించారు.
వార్తలు
'మాతృభాష వికాసానికి సీటీఏ కృషి అభినందనీయం'


