హైదరాబాద్: 28°C
వార్తలు

రాఖీ పండుగ.. సోదరుడికి జీవితాన్నే బహుమతిగా!

రాఖీ పండుగ వేళ బీనా కుమారి అనే మహిళ తన సోదరుడికి ఏకంగా జీవితాన్నే బహుమతిగా ఇచ్చింది. ఢిల్లీకి చెందిన తన తమ్ముడు జితేంద్ర కుమార్‌కు కిడ్నీ దానం చేసింది. రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తమ్ముడిని కాపాడుకునేందుకు ఆమె ముందుకురాగా, వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. సోదరుడికి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వగలిగినందుకు సంతోషంగా ఉందని ఆమె తెలిపింది.