హైదరాబాద్: 28°C
వార్తలు

జగ్గయ్యపేటలో రేపు ప్రత్యేక ప్రజా వేదిక

NTR: జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశాల మేరకు ‘ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు సందర్శనలు’ కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేటలో ఆగస్టు 28న ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఎస్.వి.ఎస్. కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి జిల్లా స్థాయి అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారు.