హైదరాబాద్: 28°C
వార్తలు

అలంపూర్‌లో రాఖీ దుకాణాల సందడి

 GDWL: అలంపూర్‌లో రాఖీ పండుగ సందడి ప్రారంభమైంది. రేపు రాఖీ పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో రాఖీ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. మహిళలు, యువతులు, చిన్నారులు తమ సోదరుల కోసం రకరకాల రాఖీలు, స్వీట్లు, చాక్లెట్లు కొనుగోలు చేశారు. రక్షాబంధన్ సందర్భంగా సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి, స్వీట్లు తినిపించడం ఆనవాయితీ కావడంతో స్వీట్, రాఖీ దుకాణాల రద్దీగా మారాయి.