హైదరాబాద్: 28°C
వార్తలు

'ఎస్సీల అభివృద్ధి నిధులు సకాలంలో ఖర్చు చేయాలి'

నాగర్‌కర్నూల్: ఎస్సీల అభివృద్ధికి కేటాయించిన 15 శాతం నిధులను విధిగా సకాలంలో ఖర్చు చేయాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి అధికారులను ఆదేశించారు. ఖర్చు చేయలేని నిధులు మురిగిపోకుండా నిబంధనల ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయాలని సూచించారు. కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్‌తో కలిసి స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌పై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.