హైదరాబాద్: 28°C
వార్తలు

యుద్ధ ట్యాంకులు కీలకం: రాజ్‌నాథ్ సింగ్

యుద్ధ ట్యాంకులు దేశ సరిహద్దుల్లో ఉక్కు గోడల్లాంటివని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. డ్రోన్లు, క్షిపణుల పాత్ర పెరుగుతున్నప్పటికీ.. భూతల దాడుల్లో యుద్ధ ట్యాంకులు కీలకమన్నారు. అవి శత్రువుల పాలిట సింహస్వప్నంలా నిలుస్తాయని, యుద్ధంలో సైనికుల మనోధైర్యాన్ని పెంచుతాయన్నారు. రణరంగంలో ఒకే వ్యవస్థపై ఆధారపడకుండా.. సమష్టి సామర్థ్యం కలిగి ఉండటం అవసరమన్నారు.