నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శుభ్రాన్షు రాయ్ భార్య శర్మిష్ట భౌమిక్ రాయ్ గల్లంతయ్యారు. కైలాస మానససరోవర యాత్ర కోసం ఆగస్టు 21న నేపాల్ వెళ్లిన ఆమె, ఆగస్టు 25న రాత్రి భర్తతో చివరిసారిగా మాట్లాడారు. మరుసటి రోజు వరదల అనంతరం ఆమెతో సంబంధాలు తెగిపోయాయి. ఆమెతోపాటు కోల్‌కతాకు చెందిన 32 మంది యాత్రికుల ఆచూకీ కూడా తెలియడం లేదు.
వార్తలు
వరదల్లో గల్లంతైన మాజీ ఎమ్మెల్యే భార్య


