హైదరాబాద్: 28°C
వార్తలు

ఫార్మర్ ఐడి తప్పనిసరి: వరలక్ష్మి

కర్నూలు జిల్లాలో 2,36,325 మంది రైతులు PM-KISAN పథకం లబ్ధిదారులుగా ఉన్నారని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు.  వారంతా e-KYCతో పాటు Farmer ID నమోదు చేసుకోవాలని సూచించారు. RSK, మండల వ్యవసాయ కార్యాలయం, CSC కేంద్రాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని, Farmer ID లేకుంటే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడం సాధ్యం కాదన్నారు.