హైదరాబాద్: 28°C
వార్తలు

పుట్టింటికి వెళ్లడం భార్య హక్కు: హైకోర్టు

కర్ణాటక హైకోర్టు వివాహ బంధంపై కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య పుట్టింటికి వెళ్లేందుకు భర్త అనుమతి తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. పెళ్లి తర్వాత ఇంటి పనులు చేయడం, అత్తమామలను చూసుకోవడం భార్య బాధ్యతలుగా భావించకూడదని పేర్కొంది. వివాహ బంధం పరస్పర గౌరవం, సమానత్వంపై ఆధారపడాలని తెలిపింది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, ఆత్మగౌరవాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసింది.