హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నకిలీ వైద్యులపై ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. నగరంలో 12 మంది అనర్హ వైద్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. వీరు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, ఇంజెక్షన్లు ఇచ్చి ఆరోగ్యానికి హాని చేస్తునట్లు పేర్కొన్నారు. క్లినిక్‌లలో DMHO సర్టిఫికెట్, TSMC రిజిస్ట్రేషన్ నంబర్ చెక్ చేసుకోవాలన్నారు. సందేహం ఉంటే 112కు ఫోన్ చేయాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: నకిలీ వైద్యులపై ప్రజలకు సీపీ హెచ్చరిక


