హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయ్యోరు పల్లి పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్

SRCL: వేములవాడ అయ్యోరుపల్లి ప్రభుత్వ పాఠశాలలో రక్షాబంధన్ వేడుక ఘనంగా జరిగింది. విద్యార్థులు స్వయంగా తయారుచేసిన రాఖీలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ గుడిసె సంతోష్ రాఖీలను పరిశీలించి విద్యార్థుల సృజనాత్మకతను అభినందించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. వార్డు ఆఫీసర్ రాజు, హెచ్ఎం పాల్గొన్నారు.