హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్కంఠంగా మారిన రామగుండం అధ్యక్ష పీఠం రేసు

PDPL: రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికకు రంగం సిద్ధమైంది. ఏఐసీసీ పరిశీలకుడు దీపక్ రాథోడ్ బృందం రామగుండంలో పర్యటించి పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించారు. కార్పొరేషన్ అధ్యక్ష పదవి ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. సీనియర్లతో పాటు యువ నేతలు కూడా పోటీపడుతుండటంతో ఎవరికి పీఠం దక్కుతుందోనన్న ఆసక్తి నెలకొంది.