JGL రాయికల్ మండలం భూపతిపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థినులు విద్యార్థులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ ప్రతీక అని, ఆడపిల్లలను గౌరవించి రక్షించాలని హెచ్ఎం వెంకటరమణి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ
భూపతి పూర్ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు


