NLG: చండూరు మార్కెట్ యార్డులో ధాన్యం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 12 మంది నిందితులను గుర్తించి 11 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 9.80 లక్షలు, బొలేరో వాహనం, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ తాళంతో గోదాంలోకి ప్రవేశించి ధాన్యం చోరీ చేసి ఇతర ప్రాంతాల్లో విక్రయించినట్లు సీఐ రాము తెలిపారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.
తెలంగాణ
'మార్కెట్ యార్డ్‌లో ధాన్యం చోరీ కేసు చేదన'


