SRCL: విద్యార్థులు వేధింపులకు గురైతే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని షీ టీం ఏఎస్ఐ ప్రమీల అన్నారు. గురువారం ముస్తాబాద్ మండలం అవునూరు పాఠశాలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, సోషల్ మీడియా మోసాలపై అవగాహన కల్పించారు. వేధింపులకు గురైతే షీ టీం నంబర్ 8712656425కు ఫిర్యాదు చేయాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు . అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణ
'వేధింపులకు గురైతే నిర్భయంగా ఫిర్యాదు చేయాలి'


