హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిద్దిపేటలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన ఉధృతం

SDPT: సిద్దిపేటలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన ఉధృతమైంది. GO 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ఛాంబర్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా BRSV నాయకులు కూడా నిరసన చేపట్టారు. GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.