MDK: మనోహరాబాద్‌లోని గోశాలలో తూప్రాన్, చేగుంట లయన్స్ క్లబ్‌ల ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ ఎస్. వెంకటయ్య గోవులు, లేగదూడలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. గోసంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, మూగజీవాల పట్ల సేవాభావం పెంపొందించాలని నిర్వాహకులు సూచించారు.
తెలంగాణ
గోశాలలో ఉచిత పశువైద్య శిబిరం


