హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల మహా ధర్నా

WGL: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల చెల్లింపుతో పాటు ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జేఏసీ నాయకులు వేణుగోపాల్, రాంకిషన్ డిమాండ్.