KMM: ECI & CEO, ఆదేశాల మేరకు నేడు కామేపల్లి మండలం కేప్టెన్ బంజారా గ్రామపంచాయతీలో SIR-2026 డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ పై గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అచ్చమ్మ పాల్గొని మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా, ఎలాంటి తప్పులు లేకుండా జాబితాను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా పై గ్రామసభ నిర్వహణ


