హైదరాబాద్: 28°C
తెలంగాణ

భైరాన్‌పల్లిని ‘వీర భైరాన్‌పల్లి’గా మార్చాలి: ఎమ్మెల్యే

సిద్ధిపేట జిల్లా ధూళిమిట్ట మండలం భైరాన్‌పల్లిలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అమరులకు నివాళులర్పించారు. భైరాన్‌పల్లిని 'వీర భైరాన్‌పల్లి'గా నామకరణం చేయాలని, వారి చారిత్రక పోరాటాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు. గ్రామాన్ని టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తూ, అమరవీరుల కుటుంబాలను సన్మానించారు.