హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్యాలలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు రాఖీలు కట్టుకుని సోదరభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా దేశ ఐక్యత, సంస్కృతి పరిరక్షణపై నిర్వాహకులు అవగాహన కల్పించారు.