KMR: మహ్మదాబాద్ తండా నుంచి జుక్కల్ చౌరస్తా వరకు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గురువారం పాదయాత్ర చేపట్టారు. బాగున్న బీటీ రోడ్డును తవ్వి ఏడాది గడుస్తున్నా కంకర వేసి పనులు నిలిపివేశారని ఆరోపించారు. ఇదే రోడ్డుపై స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ప్రయాణిస్తున్నా దుస్థితి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: రోడ్ల మరమ్మతుల కోసం మాజీ MLA పాదయాత్ర!


