ADB: జిల్లా కేంద్రంలోని సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సీనియర్ లెక్చరర్ షాహేజామ ఫాతిమా డాక్టరేట్ పట్టా గురువారం అందుకున్నారు. భోపాల్‌లోని మానస సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీలో 'ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్' అంశంపై సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆమె పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఫాతిమాను కళాశాల సిబ్బంది అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
పీహెచ్‌డీ పట్టా అందుకున్న ఫాతిమా


