హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోచమ్మ అమ్మవారి విగ్రహ ఊరేగింపు

SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో గురువారం పోచమ్మ అమ్మవారి విగ్రహ ఊరేగింపును గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించారు. మహిళలు మంగళహారతులు సమర్పిస్తూ, భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ వేడుకల్లో పాల్గొన్నారు.