హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాక్సింగ్‌లో నర్సీపట్నం క్రీడాకారుల సత్తా

AKP: తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఈనెల 24 నుంచి 27 వరకు జరిగిన రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్‌ కప్‌ బాక్సింగ్‌ పోటీల్లో నర్సీపట్నం క్రీడాకారులు సత్తాచాటారు. 9 మంది బాలికలు పతకాలు సాధించారు. హరిణి, సమంత, మౌనిక, రోహిణి స్వర్ణం, కుసుమకుమారి, తేజస్విని రజతం, రిషిత, సాయి, యజ్ఞ కాంస్య పతకాలు సాధించారు.