ప్రకాశం: త్రిపురాంతకంలోని శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి, బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయాల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు మాగుంటకు స్వాగతం పలికారు. అనంతరం ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు శేషవస్త్రం కప్పి ఆశీర్వాదం ఇచ్చారు. యర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
త్రిపురాంతకంలో ఎంపీ ప్రత్యేక పూజలు


