హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భర్తను ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన భార్య

కోనసీమ: రామచంద్రపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో తంగేటి ఎల్లారావు(46)ను భార్య ఉమాదేవి మసాలా నూరే ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. తరచూ.. జరుగుతున్న గొడవలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.