హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయచోటిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని ఎస్‌ఎన్‌ కాలనీ చెక్‌పోస్ట్ సమీపంలోని శివాలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.