హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అదనపు భవనాలతో వసతి సమస్యకు పరిష్కారం

ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు భవనాల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం సుమారు రూ.70 లక్షలు కేటాయించింది. ఈ నిధులతో అదనపు తరగతి గదులు, తాగునీటి బోరు, డైనింగ్‌ హాల్‌ మరమ్మతులు చేపడుతున్నారు. అదనంగా ఐదు తరగతి గదుల నిర్మాణం జరుగుతోంది.దీంతో తరగతి గదుల కొరత తీరడంతో విద్యార్థులకు వసతి సమస్య పరిష్కారం కానుంది.