హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్నాడులో జరిగిన ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి

BPT: పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.