హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వింజమూరులో అగ్ని ప్రమాదం

NLR: వింజమూరులోని ఓ గ్యాస్ గోడౌన్ సమీపంలో గురువారం వేకువజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెత్తకు మంటలు అంటుకున్నట్లు సమాచారం. క్షణాల్లో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. స్క్రాప్ సామాగ్రి, పలు పరికరాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. గ్యాస్ గోడౌన్ కు సమీపంలో ఘటన జరగడంతో స్థానికులు భయపడ్డారు.