హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దులీప్ ట్రోఫీ మేనేజర్‌గా కె. నాగ గంగాధర్

AKP: దులీప్ ట్రోఫీ దక్షిణ జోన్ జట్టు మేనేజర్‌గా విశాఖకు చెందిన కె. నాగ గంగాధర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ ఈ నెల 30న బెంగళూరులో, ఫైనల్ మ్యాచ్ సెప్టెంబరు 6న చెన్నైలో జరగనున్నాయని నిర్వాహకులు వెల్లడించారు.