VSP: నేడు విశాఖకు మంత్రి నారా లోకేశ్ రానున్నారు. సాయంత్రం 6.30 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుని, 7.20 గంటలకు బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్తారు. అక్కడ శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 8.40 గంటలకు తిరిగి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని అమరావతికి తిరుగుపయనమవుతారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విశాఖకు మంత్రి లోకేశ్ రాక


