హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

50కేజీల గంజాయి స్వాధీనం

ASR: ముంచింగిపుట్టు మండలంలోని లబ్బూరు జంక్షన్ వద్ద పోలీసులు రూ.25లక్షల విలువైన 50కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జీ.మాడుగుల సీఐ లక్ష్మణరావు ఎస్సై పీ.నాని నిన్న వాహన తనిఖీలు నిర్వహించారు. లక్ష్మీపురం వైపు నుంచి వచ్చిన హోండా సిటీ కారులోని నలుగురు పారిపోయేందుకు యత్నించగా పట్టుకున్నారు. తనిఖీలు చేసి, వారి నుంచి గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు.