హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు వేయండి..

పార్వతీపురం పురపాలక సంఘంలో ఖరీదైన నివాస ప్రాంతంగా పేరున్న గణేష్‌నగర్ కాలనీలో మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. సౌందర్య థియేటర్, ఆర్టీసీ కాంప్లెక్సు, గణేష్‌నగర్ ప్రాంతాల్లో సుమారు 380 నివాస గృహాలున్నా సీసీ రోడ్లు, కాలువలు పూర్తిస్థాయిలో లేవు. ప్రధాన రహదారిని మూడేళ్ల క్రితం సీసీ రోడ్డుగా మార్చినా, అంతర్గత వీధులను పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు.