హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షాభావంలోనూ ఖరీఫ్‌ సాగుకు ప్రత్యేక చర్యలు

GNTR: రాష్ట్రంలో 51 శాతం వర్షపాతం లోటు ఉన్నా ఖరీఫ్‌ సాగుకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టిందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఫిబ్రవరి నుంచే అంచనా వేసి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రస్తుతం 20.35 లక్షల హెక్టార్లలో ఖరీఫ్‌ సాగు జరుగుతుందన్నారు.