హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐఫోన్ కొనివ్వలేదని బాలిక ఆత్మహత్య

విశాఖ: ఐఫోన్ కొనివ్వలేదనే మనస్తాపంతో ధర్మానగర్‌లో 15ఏళ్ల బాలిక నిన్న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. తల్లి వద్ద ఉంటున్న బాలిక నాలుగు రోజులుగా ఫోన్ అడుగుతుండగా, డబ్బు లేదని తల్లి మందలించింది. దీంతో గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని ఉరేసుకుంది. కేజీహెచ్‌కు తరలించగా వైద్యులు మృతి చెందిందని ధ్రువీకరించారు.