హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సారూ! ఈ దారిని బాగు చేయరూ..!

ప్రకాశం: మర్రిపూడి(M) చిమట నుంచి శివరాయనపేట మీదగా ఉప్పలపాడు వెళ్లే రహదారికి ఇరువైపులా చెట్లు అల్లుకు పోవడంతో ప్రయాణించడానికి ఇబ్బందికరంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. ఈ రోడ్‌లో ప్రయాణించే వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు తొలిగే సమయంలో తరచూ గాయాలపాలవు తున్నామని వాపోతున్నారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని ఇరువైపులా దట్టంగా పెరిగిన చెట్లను తొలగించాలని కోరుతున్నారు.