హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుక్కల దాడి లో 12 గొర్రె పిల్లలు మృతి

సత్యసాయి: పెనుకొండ మండలం వెంకటగిరిపాళ్యం గ్రామంలో కుక్కలు దాడి చేయడంతో రైతు మహేశ్‌కు చెందిన 12 గొర్రె పిల్లలు బుధవారం మృతి చెందాయి. ఈ ఘటనలో సుమారు రూ.1.50 లక్షల మేర ఆర్థిక నష్టం వాటిల్లిందని రైతు కన్నీటిపర్యంతమయ్యారు. గొర్రెల పెంపకమే తన ఏకైక జీవనాధారమని ,ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని, మృతి చెందిన గొర్రె పిల్లలకు తక్షణ నష్టపరిహారం అందించాలని రైతు కోరారు.