హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం హుండీ ఆదాయం రూ.5.88 కోట్లు

NDL: శ్రీశైలం దేవస్థానంలో బుధవారం హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. 35 రోజులకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.5,88,89,846 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. 87.2 గ్రాముల బంగారం, 4.25 కిలోల వెండి, 540 అమెరికా డాలర్లు, 1,610 యూఏఈ దిర్హమ్స్‌తో పాటు ఇతర దేశాల కరెన్సీ లభించినట్లు తెలిపారు.