హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదర్ థెరిసా స్ఫూర్తితో సేవలు అందించాలి: RMO

WG: రోగులకు సేవలందించడంలో మదర్ థెరిసాను స్ఫూర్తిగా తీసుకోవాలని రీజనల్ మెడికల్ ఆఫీసర్ కాంతి భూపతి సూచించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. సేవా భావంతో బాధితులకు స్వాంతన చేకూర్చాలని క్లబ్ ప్రతినిధులు హరిబాబు, కొండూరి రాము కోరారు. ఉత్తమ సేవలందించిన ఆసుపత్రి సిబ్బందిని సన్మానించారు.