హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కూల్ స్వీపర్లకు 7 నెలల వేతనాలివ్వాలి: IFTU

WG: మున్సిపల్ పాఠశాలల స్వీపర్లకు పెండింగ్లో ఉన్న 7 నెలల జీతాలను తక్షణమే చెల్లించాలని IFTU జిల్లా నాయకుడు మామిడి దానవరప్రసాద్ డిమాండ్ చేశారు. బుధవారం తాడేపల్లిగూడెం IFTU కార్యాలయంలో స్కూల్ స్వీపర్లు, పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం నిర్వహించారు. నెలకు కేవలం రూ.4 వేల వేతనంతో ఎలా బతకాలని ప్రశ్నిస్తూ.. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని కోరారు.