హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు

NTR: ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర ఆలయ వార్షిక పవిత్రోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పూజలు, క్రతువులకు ఏర్పాట్లు పూర్తి చేసి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తొలిరోజు సుప్రభాత సేవ, మూలవిరాట్ కు స్నపనాభిషేకం, పవిత్రమాలా ధారణ ఉంటుంది. ఉదయం 8 గంటల తర్వాతే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తామని అని EO శీనా నాయక్ తెలిపారు.