హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆషాఢ మాసం ముగిశాక భార్య వద్దకు వెళ్తూ దుర్మరణం

WG: ఆషాఢ మాసం ముగిశాక భార్యను తీసుకువచ్చేందుకు అత్తవారింటికి వెళ్తున్న భర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఉంగుటూరు మండలం బొమ్మిడికి చెందిన తోరంగి నాగ కిరణ్ (27), కోరుకొల్లుకు చెందిన ఈశ్వరిలకు ఏడాది క్రితం పెళ్లయింది. తణుకు నుంచి అత్తవారింటికి వెళ్తుండగా పైడిపర్రు వద్ద లారీ ఢీకొన్న ఘటనలో కిరణ్ ప్రాణాలు కోల్పోయారు.