హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్యాన్సర్ బాధిత కుటుంబానికి గ్రామస్థుల అండ

KKD: క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆటో డ్రైవర్ కృష్ణబాబు కుటుంబానికి చిత్రాడ గ్రామస్థులు అండగా నిలిచారు. గ్రామ పెద్దలు, యువత, దాతలు కలిసి రూ. 40 వేల ఆర్థిక సాయంతో పాటు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులను కుటుంబ సభ్యులకు అందజేశారు. కృష్ణబాబు తదుపరి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని గ్రామస్థులు తెలిపారు.