హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మల్లికార్జున స్వామి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ

E.G: కోరుకొండ మండలం కనుపూరులో ఉన్న శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి కొండ చుట్టూ గురువారం సాయంత్రం 4 గంటలకు గిరిప్రదక్షిణ జరగనుంది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా 2వ ఏడాది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ వేళ 7 కేజీల ముద్దహారతి కర్పూరంతో ఏక జ్యోతి వెలిగించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కమిటీ కోరింది.