హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొల్లప్రోలులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

KKD: గొల్లప్రోలు NH-216 రహదారి సమీపంలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీరామ్ స్కూల్ సమీపంలోని పొదల్లో ఉన్న వర్షపు నీటి గుంటలో సాయంత్రం 5 గంటలకు 45 నుంచి 50 ఏళ్ల వయసున్న పురుషుడి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు నలుపు రంగు టీషర్ట్, ఖాకీ రంగు నిక్కరు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.