TG: రాష్ట్రంలో ప్రస్తుతం 3.12 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. ఆయిల్ పామ్ విస్తరణకు ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.515.84 కోట్ల ఖర్చు చేసిందని వివరించారు. 2026-27లో అదనంగా 21,230 ఎకరాలకు ఈ పంట విస్తరణకు ప్రణాళికలు చేసినట్లు చెప్పారు. ఈ తోటల ద్వారా రైతులు 30 ఏళ్ల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వార్తలు
3.12 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు: ఉత్తమ్


