KDP: పోరుమామిళ్ల మండలం నాగలకుంట్లలో బాకీ డబ్బుల కోసం సౌభాగ్యమ్మను బెదిరించి ఇంటికి తాళం వేసిన ఘటనపై బుధవారం ముగ్గురిపై కేసు నమోదైంది. ఈ నెల 25న భర్త ఇంట్లో లేని సమయంలో వచ్చిన ముగ్గురు ఇంటిని తగలబెడతామని బెదిరించి, సౌభాగ్యమ్మను బయటకు లాగి తాళం వేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఎస్‌ఐ హనుమంతు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మహిళను బెదిరించి ఇంటికి తాళం.. ముగ్గురిపై కేసు


